మనసును తట్టిలేపుతోన్న 'సవ్యసాచి' లిరికల్ సాంగ్
- హృదయాన్ని తాకే సాహిత్యం
- ఆకట్టుకునే సంగీతం
- నవంబర్ 2న విడుదల
ఒకే తనువుగా కలిగిన తన కవల పిల్లల గురించి ఒక తల్లి పాడే పాటగా ఇది కొనసాగుతోంది. "నా కలలకు రెక్కలు మీరు .. నా ఎనిమిది దిక్కులు మీరు" అంటూ తన పిల్లల గురించి ఓ తల్లి ఆవిష్కరించిన భావజాలం అద్భుతమనే చెప్పాలి. ఈ అక్షరాలు తల్లి హృదయాన్ని తట్టిలేపేలా వున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చాలా బాగుంది .. ఇక కీరవాణి బాణీల్లోని బలం ఎంతమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించేలా ఈ పాట వుంది. భూమిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.