అభిమానికి అల్లు శిరీష్ ల్యాప్ టాప్
- అన్నయ్య చాలా గిఫ్టులు ఇచ్చాడు
- ఇప్పుడు మరో గిఫ్ట్ చేతికొచ్చింది
- చాలా సంతోషంగా వుంది
ఈ ట్వీట్ పై ఒక అభిమాని స్పందిస్తూ .. "అన్నా, నాకు ఒక చిన్న ల్యాప్ టాప్ ఇవ్వొచ్చు కదా .. నేను కొనాలంటే ఓ మూడేళ్లు పడుతుంది. నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ .. జీతం తక్కువ. నాకు ల్యాప్ టాప్ చాలా అవసరం .. కానీ ఇంతవరకూ కొనుక్కోలేకపోయాను" అంటూ రాసుకొచ్చాడు. అందుకు అల్లు శిరీష్ 'నువ్వేం బాధపడకు తమ్ముడు .. నాకు కొత్త ల్యాప్ టాప్ వచ్చింది గనుక, నా దగ్గరున్న సోనీ ల్యాప్ టాప్ నీకు ఇస్తాను .. నీ పూర్తి వివరాలు మెయిల్ చేయి' అంటూ సమాధానమిచ్చాడు.