భారీ యాక్షన్ మూవీ చేయాలనుంది: సుధీర్ బాబు
- 'నన్నుదోచుకుందువటే'కి మంచి రెస్పాన్స్
- యూత్ నుంచి మంచి మార్కులు
- నెక్స్ట్ మూవీగా 'వీర భోగ వసంత రాయలు'
ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో సుధీర్ బాబు వున్నాడు. తాజా ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా తరువాత ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలని వుంది అని చెప్పాడు. తెలుగులో ఒక బెంచ్ మార్క్ లా నిలిచిపోయేలా ఒక యాక్షన్ మూవీ చేయాలనే కోరిక ఎప్పటినుంచో వుంది. త్వరలోనే ఆ ముచ్చట తీర్చుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.