ఆసక్తిని రేపుతోన్న 'మిస్టర్ మజ్ను' ఫస్టులుక్
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్
- షూటింగు దశలో 'మిస్టర్ మజ్ను'
- జనవరి 26న రిలీజ్ చేసే ఛాన్స్
"దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు .. కావ్యములో కాముడు .. అంతకన్నా రసికుడు .. "అంటూ ఈ సాంగ్ సాగుతోంది. "దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు" అనే అఖిల్ డైలాగ్ ఈ వీడియోలో చోటు చేసుకుంది. కొత్త లుక్ తో కనిపిస్తూ అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.