అఖిల్ మూవీ టైటిల్ ఖరారైపోయినట్టే!
- వెంకీ అట్లూరి నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- అఖిల్ సరసన నిధి అగర్వాల్
- సినిమాపై ఆశలు పెట్టుకున్న అఖిల్
ఈ సినిమాలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. గతంలో వెంకీ అట్లూరి నుంచి వచ్చిన 'తొలిప్రేమ' ఘన విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇంతకు ముందు అఖిల్ నుంచి రెండు భారీ సినిమాలు వచ్చినా అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అందువలన ఈ సారి తనకి తప్పకుండా హిట్ పడాలనే పట్టుదలతో అఖిల్ వున్నాడు.