'మా' నిధుల దుర్వినియోగం... కార్యాలయానికి తాళం వేసిన నరేష్, అత్యవసర సమావేశం!
- మాలో భగ్గుమన్న వివాదం
- శివాజీ రాజాపై నిధుల స్వాహా ఆరోపణలు
- వివరణ ఇచ్చిన తరువాత ఏకాభిప్రాయం కుదిరిందన్న నరేష్
శివాజీ రాజా 'మా' అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత, భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు చర్చించింది. అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన నరేష్, ఓ ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన అన్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని శివాజీ రాజా ఇచ్చిన వివరణతో తృప్తి చెందామని, ఇకపై కలసి పనిచేస్తామని ఆయన చెప్పారు.