చిత్రపరిశ్రమలో అనుకోనివి అనేకం జరుగుతుంటాయి: తమన్నా
- సుదీర్ఘమైన కెరియర్ ను చూశాను
- ఆశలు పెట్టుకున్న సినిమాలు ఆడలేదు
- అంచనాలు లేనివి హిట్ కొట్టాయి
12 యేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాను. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు ఆడని సందర్భాలు వున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా చేసిన సినిమాలు ఘన విజయాలను సాధించాయి. హిందీలో నేను చేసిన సినిమాలు నాకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. తెలుగులో చేసిన 'బాహుబలి' హిందీలోకి వెళ్లడం వలన నాకు అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. అనుకున్నవి జరగకపోవడం .. అనుకోనివి జరిగిపోవడం ఇక్కడ ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తుంటాయి" అని చెప్పుకొచ్చింది.