పెళ్లి కోసం చాలా షరతులు పెడుతున్నారు!: హీరోయిన్ పూర్ణ
- పెద్ద హీరోలతో చేయకపోవడంతో మలయాళంలో పేరు రాలేదు
- అక్కడ డ్యాన్స్ అవకాశం ఉన్న పాత్రలే వస్తున్నాయి
- ఇంట్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న తనకు తరచుగా ఎదురవుతోందని... తాను ముస్లిం అని, తనకు పెళ్లి చేయాలని ఇంట్లో కూడా అనుకుంటున్నారని పూర్ణ తెలిపింది. అయితే పెళ్లి కోసం వస్తున్నవారు చాలా షరతులు పెడుతున్నారని... ముఖ్యంగా సినిమాలను వదిలేయాలనే కండిషన్ పెడుతున్నారని చెప్పింది. పెళ్లి కోసం తనను తాను మార్చుకోలేనని స్పష్టం చేసింది.