ఘనంగా ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి వివాహం.. బాస్ వచ్చేశారంటూ హీరో కార్తికేయ జోక్!
- హైదరాబాద్ లో ఘనంగా పెళ్లి
- హాజరైన హీరో కార్తికేయ
- ప్రేమ వివాహం చేసుకున్న అజయ్

అజయ్ భూపతి-శిరీష జంటతో దిగిన ఫొటోలను ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. ‘నా బాస్ అజయ్ భూపతికి బాస్ వచ్చేశారు. శుభాకాంక్షలు సార్’ అని ట్వీట్ చేశాడు. తాను రెండేళ్ల క్రితమే శిరీషకు ప్రపోజ్ చేశానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి చెప్పిన సంగతి తెలిసిందే.
తన ప్రేమకు శిరీష అంగీకరించినా ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనీ, కెరీర్, జీవితంలో సెటిల్ కాకపోవడమే అందుకు కారణమని వెల్లడించాడు. దీంతో తనకు రెండేళ్ల సమయం ఇస్తే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారతానని వారికి మాటిచ్చానని చెప్పాడు. ఇచ్చినమాట ప్రకారం ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టడంతో పెళ్లికి అందరూ అంగీకరించారని వెల్లడించాడు. తామిద్దరిదీ ఆత్రేయపురమేనని అజయ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.