'నన్నుదోచుకుందువటే' టీమ్ ప్రీ రిలీజ్ టూర్
- సుధీర్ బాబు తాజాగా చిత్రంగా 'నన్నుదోచుకుందువటే'
- రెండు రోజుల పాటు ప్రీ రిలీజ్ టూర్
- వచ్చేనెల 13వ తేదీన విడుదల
ప్రమోషన్ లో భాగంగా 25వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు 'రాజమండ్రి'లోని ఐ.ఎస్.టి.ఎస్ కాలేజ్ కి ఈ సినిమా టీమ్ చేరుకోనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు 'కాకినాడ'లోని కెఐఈటీ ఉమెన్స్ కాలేజ్ లో అభిమానులను కలవనున్నారు. ఇక 26వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం - అరసవిల్లి ఆలయానికి చేరుకోనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి విశాఖపట్నంలోని సిఎంఆర్ మాల్ లో సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.