సూర్యుడి అధ్యయనానికి ఇస్రో శాటిలైట్ ఆదిత్య-ఎల్ 1
- సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో పంపబోతున్న శాటిలైట్ ఆదిత్య-ఎల్1
- 2019-2020లలో ఈ ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను లాంచ్ చేయాలని ఇస్రో భావన
- కరోనాతోపాటు సూర్యుడి ఫొటో స్పియర్, క్రోమోస్పియర్ల అధ్యయనం
దీని కోసం ఈ శాటిలైట్ ఆరు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లనుంది. శాటిలైట్‌లో పంపుతున్న అదనపు పేలోడ్స్ కరోనాతోపాటు సూర్యుడి ఫొటో స్పియర్, క్రోమోస్పియర్‌లను అధ్యయనం చేయనున్నాయి. మొదట ఈ శాటిలైట్ ను హాలోఆర్బిట్ అనే కక్ష్య లోనికి పంపిస్తారు. సూర్యుడు-భూమి వ్యవస్థలోని హాలోఆర్బిట్ లాగ్రేంగియన్ పాయింట్ 1లో ఉండే శాటిలైట్ సూర్యుడిని ఎలాంటి గ్రహణాలు లేకుండా చూసే వీలుంటుంది.
అందుకే ఇస్రో ఈ మిషన్‌ను ఆదిత్య-1 నుంచి ఆదిత్య-ఎల్1గా మార్చింది. 2019-2020లలో ఈ ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను లాంచ్ చేయాలని ఇస్రో భావిస్తోంది. పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ ద్వారా ఏపీలోని శ్రీహరికోట నుంచి దీనిని నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రో మరో కీలక మైలు రాయిని దాటినట్టవుతుంది.