సుధీర్ బాబు .. మెహ్రీన్ ల న్యూ మూవీ లాంచ్
- పులి వాసు దర్శకుడిగా తాజా చిత్రం
- రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు
- సుధీర్ బాబు జోడీగా మెహ్రీన్
ఈ కాంబినేషన్లోని సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. ప్రముఖ దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా .. దిల్ రాజు క్లాప్ ఇవ్వగా .. ముహూర్తపు సన్నివేశానికి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ .. పోసాని కృష్ణ మురళి .. సీనియర్ నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు.