థ్రిల్లర్ మూవీగా 'యూటర్న్' .. త్వరలో టీజర్ రిలీజ్
- సమంత ప్రధాన పాత్రగా 'యూటర్న్'
- ఈ నెల 17వ తేదీన టీజర్ రిలీజ్
- సెప్టెంబర్ 13వ తేదీన సినిమా విడుదల
థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమా నుంచి, ఈ నెల 17వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తో సినిమాపై భారీగా అంచనాలను పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుందనీ .. సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ, అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శకుడు పవన్ కుమార్ అంటున్నాడు.