బ్రహ్మానందం కొడుకు సినిమాకి 115 మంది నిర్మాతలు
- గౌతమ్ హీరోగా 'మను'
- కథానాయికగా చాందిని
- సెప్టెంబర్ 7న విడుదల
చాందిని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ఫణీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను" అన్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. సన్నివేశాలు .. సంభాషణలు చాలా నేచురల్ గా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో గౌతమ్ పోషించిన పాత్ర కొత్తగా వుంటుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.