సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డాక్టర్ పాత్రలో కనిపించనున్న కాజల్
- రవితేజ సినిమా విడుదల తేదీ ఖరారు
- హన్సిక 50వ చిత్రంగా 'మహా'!
* శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి నిర్మాతలు తాజాగా డేట్ ను నిర్ణయించారు. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తోంది.
* కథానాయిక హన్సిక నటించే తాజా చిత్రం పేరు 'మహా'. విశేషం ఏమిటంటే, ఇది ఆమె నటిస్తున్న 50వ చిత్రం. జమీల్ దర్శకత్వంలో తమిళ, తెలుగు బాషలలో రూపొందే ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే నెల నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.