ఎన్టీ రామారావుగారు అలా అనడంతో ధైర్యం వచ్చింది : నటి సుధ
- ఎన్టీఆర్ పెద్దకూతురిగా చేశాను
- షూటింగు తొలిరోజున ఆయనను చూశాను
- ఆయనతో మాట్లాడటానికి భయపడ్డాను
'ఈ సినిమాలో మీ పెద్దమ్మాయిగా చేసేది ఈ అమ్మాయే ' అంటూ డైరెక్టర్ గారు నన్ను రామారావుగారికి పరిచయం చేశారు. 'పేరేంటమ్మా' అన్నారాయన. చెప్పడానికి నేను భయపడిపోయాను. అప్పుడాయన దగ్గరికి తీసుకుని .. 'ఎందుకు భయపడతావు .. నువ్వు నా పెద్దమ్మాయివి .. మీ నాన్నగారితో ఎలా వుంటావో .. నాతో అలాగుండాలి' అన్నారు. అంతే ఆయనలా మాట్లాడటంతో భయంపోయి .. మనసు తేలికపడింది. ఎన్టీ రామారావుగారి తరువాత బాలకృష్ణ .. జూనియర్ ఎన్టీఆర్ లతో నటించాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావు తరువాత నాగార్జున .. చైతూలతోనూ నటించాను. ఇదంతా నా అదృష్టంగా నేను భావిస్తుంటాను" అని చెప్పుకొచ్చారు.