నాని చేతుల మీదుగా 'గూఢచారి' ట్రైలర్ రిలీజ్
- అడివి శేష్ హీరోగా 'గూఢచారి'
- కీలకపాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. సుప్రియ
- ఆగస్టు 3వ తేదీన విడుదల
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, టైటిల్ కి తగినట్టుగానే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రకాశ్ రాజ్ .. వెన్నెల కిషోర్ .. సుప్రియ కీలకమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో అడివి శేష్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.