సామ్రాట్ తో ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చిన తేజస్వి!
- సామ్రాట్ మంచి మనిషి
- ఆయనను ఎక్కువగా చూపించడం లేదు
- మా మధ్య ఏమీ లేదు
తాజాగా ఆమె ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ "అందరూ కూడా సామ్రాట్ కు ..నీకు మధ్య ఏముంది? అని అడుగుతున్నారు. మా మధ్య ఏమీ లేదు .. ఆయన ఒక మంచి మనిషి .. అలాగే తనీశ్ కూడా. మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్లని ఒక టీమ్ అనొచ్చు .. మరేదైనా అనొచ్చు. షోలో సామ్రాట్ కనిపించడం లేదు .. నన్నే ఎక్కువగా చూపించారు. నేను అరవడం .. తిట్టడం .. నా గురించి వేరేవాళ్లు మాట్లాడుకోవడం చూపించారు. తిరిగి 'బిగ్ బాస్ హౌస్'లోకి వెళ్లాలనుకుంటున్నాను .. అది మీ చేతుల్లోనే వుంది" అని చెప్పుకొచ్చింది.