త్రిష మళ్లీ భయపెట్టడానికి వచ్చేస్తోంది
- హారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతోన్న త్రిష
- గతంలో వచ్చిన 'కళావతి' .. 'నాయకి'
- తాజాగా థియేటర్లకు రానున్న 'మోహిని'
తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన 'మోహిని'కి మాదేష్ దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా .. క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమాకి త్రిష నటన హైలైట్ గా నిలుస్తుందనీ, ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోతుందని అన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.