బిగ్ బాస్ -2... వలవలా ఏడ్చేసిన నందిని!
- హౌస్ లో ఆసక్తికర పరిణామాలు
- స్టేట్ మెంట్స్ ఇస్తూ ఎవరికి నప్పుతాయో చెప్పాలన్న బిగ్ బాస్
- వేమన పద్యానికి నందిని పేరు
- ప్రేమపూజారి తనీష్, ఎలిమినేషన్ కు భయపడే దీప్తి
ఇక 'ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుగానీ, బిగ్ బాస్ హౌస్ గురించి మాత్రం తెలియదు' అంటే... బాబు గోగినేని పేరును, 'అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతుంది' అన్న స్టేట్ మెంట్ కు గీతా మాధురిని, 'కొంచెం మంచి కొంచెం చెడు' అంటే కౌశల్ ను, 'ప్రేమ పూజారి' అంటే తనీష్ ను, 'కొండంత మనిషైనా కానీ మనసు వెన్న' అంటే అమిత్ ను, 'ఎలిమినేషన్ అంటే భయం' అన్న స్టేట్ మెంట్ కు దీప్తిని, 'ఎప్పుడూ ఆనందించే వాడు' అంటే రోల్ రైడాను, 'చిన్నదానిగా వచ్చి ఘాటు మిర్చిగా మారింది' అంటే దీప్తి సునయన పేరును హౌస్ మేట్స్ చెప్పారు.