'ఆర్ ఎక్స్ 100' శాటిలైట్ రైట్స్ కోసం భారీ పోటీ
- కార్తికేయ హీరోగా 'ఆర్ ఎక్స్ 100'
- కథానాయికగా పాయల్ రాజ్ పుత్
- యూత్ నుంచి మంచి రెస్పాన్స్
కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా అదే జోరును చూపిస్తూ ఉండటం విశేషం. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ పోటీపడుతున్నాయట. ఈ సినిమాకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాత .. 6 కోట్ల వరకూ చెబుతున్నాడట. కుర్రకారు హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేస్తోన్న ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ గనుక, కాస్త అటు ఇటుగా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారని సమాచారం.