బిగ్‌బాస్ హౌస్ నుంచి భానుశ్రీ అవుట్.. ఏడ్చేసిన దీప్తి సునయన!
- మైనస్‌గా మారిన భానుశ్రీ రచ్చ
- టఫ్ కంటెస్టెంట్ నుంచి ఒక్కసారిగా కిందికి జారిన వైనం
- వెళ్తూవెళ్తూ విజిలేసిన భాను
ఇక హౌస్ నుంచి భానుశ్రీ బయటకు వెళ్తుంటే టీం మొత్తం భావోద్వేగానికి గురైంది. దీప్తి సునయన ఆమెను పట్టుకుని వలవలా ఏడ్చేసింది. చివరగా విజిల్ వేసి నవ్వుతూ హౌస్ నుంచి బయటకు వెళ్లిన సునయన ‘బిగ్ బాంబ్’ను అమిత్, కౌశల్‌పై ప్రయోగించింది. ఇందులో భాగంగా అమిత్ కుర్చీలోనే కూర్చోవాలి. అతడు ఎక్కడికి వెళ్తే, అక్కడికి కౌశల్ ఆ కుర్చీని తీసుకెళ్లాలి.