'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్ పారితోషికం ఇంతేనా?
- కార్తికేయ కథానాయకుడిగా 'ఆర్ ఎక్స్ 100'
- యూత్ నుంచి మంచి మార్కులు
- పాయల్ రాజ్ పుత్ కి పెరిగిన క్రేజ్
ఒకానొక సమయంలో హీరోయిన్ దొరకడం కష్టమే అనే స్థితికి వచ్చేశారట. అలాంటి పరిస్థితుల్లో పాయల్ రాజ్ పుత్ ప్రస్తావన రావడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ చూసిన వాళ్లు .. అందుకు తగినట్టుగా ఆమె బాగానే డిమాండ్ చేసి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ పారితోషికంగా ఆమెకి ముట్టినది కేవలం 6 లక్షలేననే మాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. పారితోషికం కన్నా ఆ తరువాత వచ్చే ఛాన్సులపై ఆమె దృష్టి పెట్టి వుంటుందని చెప్పుకుంటున్నారు.