సదా నటించిన చిత్రానికి సెన్సార్ ఇబ్బంది.. ట్రైబ్యునల్ కి వెళ్లిన నిర్మాతలు!
- 'టార్చిలైట్' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరణ
- అశ్లీలత అధికంగా ఉండటమే కారణం
- తొలి సారి వేశ్య పాత్రను పోషించిన సదా
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కారణాలతో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగిందనుకుంటే, తాజాగా సెన్సార్ ఇబ్బంది కూడా ఎదురైంది. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపగా... అశ్లీలత మోతాదు మరీ ఎక్కువగా ఉందన్న కారణంతో సర్టిఫికేట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. దీంతో దర్శక నిర్మాతలు ఢిల్లీలో ట్రైబ్యునల్ ను ఆశ్రయించి... సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తో 'తమిళన్' సినిమాను తెరకెక్కించిన ఎ.మజీద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.