మళ్లీ పెళ్లి వద్దనే అనుకున్నాను .. కొన్ని కారణాల వలన మనసు మార్చుకున్నాను: రేణు దేశాయ్
- ఇది ప్రేమలో పడి చేసుకునే పెళ్లి కాదు
- ఒక రకంగా పెద్దలు కుదిర్చినదే
- బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను
కొన్ని నెలల ముందే వాళ్లు యూఎస్ నుంచి పూణె వచ్చారు. ఆయన కూడా డైవోర్స్ తీసుకున్నారు .. చాలా మంచి వ్యక్తి అని సన్నిహితులు చెప్పారు. నిజానికి నేను మళ్లీ పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అలాంటప్పుడు మా బంధువులు .. స్నేహితులు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జీవితంలో నీకంటూ ఒక తోడు కావాలి .. ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పారు. ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.