సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- స్కూలుకి వెళుతున్నట్టే ఉందంటున్న నాయిక
- రవితేజతో వక్కంతం వంశీ ప్రాజక్ట్?
- కలసి పాటపాడిన స్టార్ బ్రదర్స్
- వైఎస్ జగన్ రిలీజ్ చేసిన ఆడియో
* 'నా పేరు సూర్య' చిత్రంతో ఇటీవల దర్శకుడిగా మారిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రవితేజకు ఓ కథ చెప్పాడని తెలుస్తోంది. అయితే, రవితేజ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
* స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ కలసి తొలిసారిగా ఓ పాట పాడారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న 'పార్టీ' చిత్రం కోసం వీరిద్దరూ కలసి ఈ పాటను పాడడం జరిగింది. విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో వీరిద్దరూ నటించడం లేదు.
* జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్న 'ప్రేమెంత పనిచేసే నారాయణ' చిత్రం ఆడియో విడుదలైంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆడియోను అమలాపురంలో విడుదల చేశారు.