రెండో పెళ్లి వద్దంటూ రేణూ దేశాయ్‌కి ట్విట్టర్లో బెదిరింపులు
- మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రావద్దు
- పీకే మీద మీకు కోపం ఉంది
- నెటిజన్ల కామెంట్లు
'మీ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రాకూడదు' అని అభిమానులు అంటున్నారు. 'పీకే మీద మీకు కోపం ఉంది' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్లో వచ్చే నెగిటివ్ కామెంట్లను పట్టించుకోవద్దని మరికొందరు సలహా ఇస్తున్నారు. కాగా, రేణూ దేశాయ్‌పై అభిమానులు చేస్తున్న కామెంట్లపై ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి స్పందిస్తూ... రేణూ దేశాయ్, పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు పొందారని, రేణూకి ఎవరినైనా పెళ్లి చేసుకొనే స్వేచ్ఛ ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ చాలా సెన్సిబుల్ అని స్వేచ్ఛకు విలువ ఇచ్చే వ్యక్తని, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా అభిమానులు తప్పుడు చేష్టలకు పాల్పడవద్దని అన్నారు.