శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం .. టైటిల్ ఖరారు
- శ్రీవిష్ణు హీరోగా 'తిప్పరా మీసం'
- దర్శకుడిగా కృష్ణ విజయ్
- త్వరలో మిగతా వివరాలు
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో శ్రీ విష్ణు .. కృష్ణ విజయ్ ల కాంబినేషన్లోని సినిమాను ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. తెలంగాణ సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. నారా రోహిత్ తొలి క్లాప్ ఇచ్చాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ .. ఓం శ్రీ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'తిప్పరా మీసం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.