విదేశాలకి బయలుదేరుతోన్న అఖిల్
- అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను'
- కథానాయికగా నిధి అగర్వాల్
- దసరాకి రిలీజ్ చేసే ఆలోచన
బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సూపర్ హిట్ కావడం వలన, ఇది కూడా ప్రేమకథా చిత్రమే కావడం వలన ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.