రైతు సమస్యల నేపథ్యంలో 'చినబాబు' .. త్వరలో ప్రేక్షకుల ముందుకు
- పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- వచ్చేనెలలో భారీ స్థాయి రిలీజ్
తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో కార్తీ .. రైతుగా కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యం.. రైతు సమస్యలే ప్రధానంగా ఈ కథ కొనసాగుతుంది. ఊరి పెద్ద చిన్నకొడుకుగా కార్తీ పాత్ర ఆకట్టుకోనుంది. భారీ బడ్జెట్ తో సూర్య నిర్మించిన ఈ సినిమాను, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.