ఒక ఇంజినీర్ చేయాల్సిన పనిని చంద్రబాబు చేయడం ఏమిటి?
- రాష్ట్రాన్ని పాలించాలంటూ చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చారు
- ఆయనేమో ప్రతి సోమవారం పోలవరంకు వెళ్తున్నారు
- వ్యాపార ప్రయోజనాల కోసమే సింగపూర్ తో ఒప్పందాలు
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఒక ప్రజా ఉద్యమంలా సాగుతోందని బుగ్గన అన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానం, చంద్రబాబుపై ఉన్న అపనమ్మకమే ఇంతటి భారీ స్పందనకు కారణమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్సులు రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.