రజనీ నన్ను 'బంగారు బొమ్మ' అని పిలిచేవారు: ఈశ్వరీరావు
- 'కాలా' టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది
- రజనీ భార్య పాత్రను చేయాలన్నారు
- ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను
ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి ఆమె మాట్లాడుతూ .. "ఒక రోజున 'కాలా' సినిమా టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయవలసి ఉంటుంది అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో నేను రజనీ భార్య పాత్రలో కనిపించనున్నాను. నన్ను ఉద్దేశించి ఈ సినిమాలో ఆయన 'బంగారు బొమ్మా' అంటూ ఒక పాట కూడా పాడతారు. అప్పటి నుంచి ఆయన నన్ను 'బంగారు బొమ్మ' అని పిలుస్తూ వచ్చారు. ఆయన సరసన నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు .. ఈ సినిమా విడుదల కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.