రానా సరసన కథానాయికగా కల్కి కూచ్లిన్
- రానా హీరోగా త్రిభాషా చిత్రం
- దర్శకుడిగా ప్రభు సాల్మన్
- నెక్స్ట్ షెడ్యూల్ ఆగస్టు నుంచి
తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానా సరసన కథానాయికగా బాలీవుడ్ నటి 'కల్కి కూచ్లిన్' నటిస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఆగస్టు నుంచి ప్లాన్ చేశారు. అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని రానా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.