సెల్ఫీల విషయంలో కేటీఆర్ సరదా కామెంట్.. స్పందించిన టాలీవుడ్ ప్రిన్స్!
- కేటీఆర్ తో సెల్ఫీని పోస్టు చేసిన నెటిజన్
- 'నీ కోసమే' అంటూ మహేష్ కు ట్యాగ్ చేసిన కేటీఆర్
- చిరునవ్వు ఎమోజీని పోస్టు చేసిన మహేష్
ఇక తాజాగా ఓ నెటిజన్, తాను కేటీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, "నిజమే... కేటీఆర్ గారు అబ్బాయిలకి కూడా సెల్ఫీలు ఇస్తారు" అనే కామెంట్ తో దాన్ని కేటీఆర్ కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. దానిపై రీ ట్వీట్ చేస్తూ, మహేష్ బాబును ట్యాగ్ చేసి, "మహేష్... ఇది నీ కోసమే" అన్న కామెంట్ ను ఉంచారు. దీన్ని చూసిన మహేష్ ఓ చిన్న స్మైలీ ఎమోజీని పోస్టు చేశారు.