అనూ ఇమ్మాన్యుయేల్ తప్పుకోవడం గురించి రవితేజ!
- ఈ నెల 25న 'నేల టిక్కెట్టు' రిలీజ్
- లవ్ .. కామెడీ .. ఎమోషన్ కి ప్రాధాన్యత
- ఫ్యామిలీ ఆడియన్స్ ను రప్పించే కంటెంట్
రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన 'అమర్ అక్బర్ అంటోని' ప్రస్తావన ఇదే సమయంలో వచ్చింది. ఈ సినిమాలో నుంచి అనూ ఇమ్మాన్యుయేల్ తప్పుకోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు రవితేజ స్పందిస్తూ .. "అనూ ఇమ్మాన్యుయేల్ 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించింది. అవే డేట్స్ లో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయవలసి వచ్చింది. ఇబ్బంది అవుతుందని భావించే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమెతో తప్పకుండా త్వరలోనే ఒక సినిమా చేస్తాను" అని చెప్పుకొచ్చారు.