తెరపై నాతో జోడీ కట్టడానికి హీరోయిన్స్ పోటీపడేవారు: చంద్రమోహన్
- నా సరసన చాలామంది హీరోయిన్స్ చేశారు
- నాతో కలిసి నటిస్తే స్టార్ డమ్ వచ్చేసేది
- జయసుధతో 25 సినిమాలు చేశాను
అందుకాయన స్పందిస్తూ .. " ఇది కాకతాళీయమే అయినా అప్పట్లో ఈ సెంటిమెంట్ బాగా బలపడిపోయింది. నా సినిమాతోనే అరంగేట్రం చేస్తామని భానుప్రియ .. శాంతిప్రియ పట్టుబట్టారు. రాధిక.. విజయశాంతి .. సులక్షణ .. శ్రీదేవి .. జయసుధ .. జయప్రద అంతా కూడా నా సరసన నటిస్తే టాప్ పొజీషన్ కి వెళ్లిపోతామని భావించేవారు .. నిజంగానే తరువాత సినిమాకి వాళ్లు నాకు అందనంత స్థాయికి వెళ్లిపోయేవాళ్లు. ఆ సెంటిమెంట్ కారణంగా మాధవి .. రాధిక .. విజయశాంతి నాతో ఏడెనిమిది సినిమాలు చేశారు. ఒక్క జయసుధతో మాత్రం 25 సినిమాల వరకూ చేశాను " అని చెప్పుకొచ్చారు.