తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్ .. దర్శకుడిగా తేజ?
- హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్
- అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య
- ఆర్ధిక పరిస్థితులు కారణం కాదన్న సోదరి
ఉదయ్ కిరణ్ ను 'చిత్రం' సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసింది తేజానే. అందువలన ఈ బయోపిక్ విషయంలో నిజం వుండే అవకాశమే ఎక్కువని చెప్పుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత 'మస్కట్' లో వుండే ఆయన సోదరి శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆయనకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవంటూ కొన్ని విషయాలు ప్రస్తావించింది. అవన్నీ కూడా ఈ బయోపిక్ లో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.