'భరత్'కి 25 రోజులు .. 205 కోట్లు!
- కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'భరత్'
- తెలుగు రాష్ట్రాల్లో 65.32 కోట్ల షేర్
- ప్రపంచవ్యాప్తంగా భారీ షేర్
మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టగా, మరి కొన్ని ఏరియాల్లో లాభాలకి చేరువలో వున్నట్టుగా చెబుతున్నారు. దర్శకుడిగా కొరటాలకి గల ఇమేజ్ .. మహేశ్ బాబుకి గల క్రేజ్ .. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. త్వరలోనే మహేశ్ బాబు తన 25వ సినిమా కోసం వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.