ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు లేవు: బీజేపీ అగ్రనేత మురళీధర్ రావు
- పార్టీలో కొత్తవారు, పాతవారు అని ఉండరు
- కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసింది
- అయినప్పటికీ మా గెలుపు ఖాయం
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ బీజేపీలో రెండు గ్రూప్ లు లేవని, పార్టీలో కొత్తవారు, పాతవారు అని ఉండరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలో రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాల గురించి ఆయన ప్రస్తావించారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసిందని, అయినప్పటికీ అక్కడ గెలుపు ఖాయమని, శ్రీరాములు లాంటి బలమైన నేతల ద్వారా తాము విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఓటమి తప్పదని తెలిసిన కాంగ్రెస్ పార్టీ.. ‘దళిత సీఎం’ అంశాన్ని తెరపైకి తెస్తోందని విమర్శించారు.