మోదీ ఓటమి స్టార్ట్ అయింది.. 2019లో ఆయన ప్రధాని కాలేరు: ప్రకాశ్ రాజ్
- ఇక నుంచి ప్రతి ఎన్నికలో బీజేపీకి ఓటమే
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అరాచకాలు అందరికీ తెలుసు
- బీజేపీని ఓడించండని కన్నడిగులను కోరుతున్నా
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కొన్ని రోజులు బీజేపీ హవా ఉందని... అప్పుడున్న హవా ఇప్పుడు లేదని... ప్రచారపర్వంలో దూసుకుపోయే మోదీ, కర్ణాటకలో కేవలం ఐదు రోజులకే పరిమితమవుతున్నారని... బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానికి ఇదే ఉదహరణ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని అరాచకాలు జరగుతున్నాయో అందరికీ తెలుసని అన్నారు. చెన్నైలో తమిళులకు భయపడిన మోదీ... రోడ్డుపై కాకుండా హెలికాప్టర్ లో ప్రయాణం చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీని ఓడించాలని కర్ణాటక ఓటర్లను తాను కోరుతున్నానని చెప్పారు.