చరణ్ మూవీ టైటిల్ 'రాజ మార్తాండ' కాదట!
- బోయపాటి దర్శకత్వంలో చరణ్
- రెండవ షెడ్యూల్ చిత్రీకరణ
- విలన్ గా వివేక్ ఒబెరాయ్
ఈ షెడ్యూల్లో చరణ్ పాల్గొంటున్నాడు. ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రాజ వంశస్థుడు' .. 'రాజమార్తాండ' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఫిక్స్ చేయలేదనేది చిత్ర సన్నిహితవర్గాల మాట. త్వరలోనే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.