తమిళంలోను 'భరత్ అనే నేను' జోరు!
- తమిళంలో 'స్పైడర్' చేసిన మహేశ్
- ఆ కారణంగా పెరిగిన క్రేజ్
- 'భరత్ అనే నేను'కి భారీ వసూళ్లు
కోలీవుడ్లో సమ్మె తరువాత ఈ సినిమా థియేటర్లకు రావడం బాగా కలిసొచ్చింది. ఈ సినిమాకి ముందు మహేశ్ చేసిన 'స్పైడర్' మూవీ కారణంగా, అక్కడి ప్రేక్షకులకు ఆయన బాగా తెలిశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా, మహేశ్ కి మంచి మార్కులు దక్కాయి. 'స్పైడర్' సమయంలో అక్కడి జనంలోకి మహేశ్ వెళ్లడం వల్లనే, ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబడుతోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.