ఆస్ట్రేలియాలో 'బాహుబలి' తరువాత ప్లేస్ లో 'భరత్ అనే నేను'
- తెలుగు రాష్ట్రాల్లో 'భరత్' దూకుడు
- ఆస్ట్రేలియాలోను అదే జోరు
- అక్కడ కొత్త రికార్డు నమోదు
శని .. ఆదివారాల్లోను ఈ సినిమా అదే జోరును కొనసాగించింది. ఈ మూడు రోజుల్లోను కలుపుకుని ఈ సినిమా అక్కడ 3.39 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టి, సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓపెనింగ్స్ విషయంలో 'బాహుబలి' తరువాత స్థానంలో నిలిచింది. 2.89 లక్షల డాలర్లతో 'రంగస్థలం' మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొత్తానికి అనుకున్నట్టుగానే మహేశ్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు.