కథ వినగానే మహేశ్ ఇంకేం ఆలోచించలేదు: కొరటాల
- మహేశ్ బాబు కథను నమ్మారు
- పాటలపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాం
- తగిన ఫలితం కనిపిస్తోంది
ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి కొరటాల మాట్లాడుతూ .. " భరత్ అనే నేను' కోసం టీమ్ అంతా ఎంతగానో కష్టపడింది. అందువల్లనే ఈ సినిమా టీజర్ .. పాటలు జనంలోకి దూసుకుపోయాయి. ముఖ్యంగా పాటల విషయంలోనూ మేం తీసుకున్న శ్రద్ధకి మంచి ఫలితం కనిపిస్తోంది. ఈ విషయంలో రామజోగయ్య శాస్త్రిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక ఈ కథను మహేశ్ బాబుకి చెప్పినప్పుడు ఆయన మరేం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. ఈ కథపై ఇంత నమ్మకం ఉంచినందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు.