షూటింగ్ పూర్తి .. కథానాయిక అనూతో బన్నీ సెల్ఫీ!
- బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
- ఈ నెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్
- మే 4వ తేదీన సినిమా రిలీజ్
బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా చేసిన ఈ సినిమా, దేశభక్తి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 22వ తీదీన ఆడియో వేడుకను నిర్వహించి .. 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. మే 4వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారు. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది ఫస్టు మూవీ కావడంతో, ఈ సినిమా ఆయనకి ఓ పరీక్ష వంటిదేనని చెప్పుకోవాలి.