'భరత్ అనే నేను'కి జీరో కట్స్ .. సెన్సార్ పూర్తి!
- మహేశ్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- హిట్ ఖాయమనే టాక్
- ఈ నెల 20వ తేదీన విడుదల
వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల సిద్ధం చేసిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఆ సక్సెస్ ల జాబితాలో 'శ్రీమంతుడు' కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో మహేశ్ వుంటే, ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో కైరా అద్వాని వుంది.