'మెర్క్యురీ' చిత్రాన్ని మెచ్చిన 'అర్జున్ రెడ్డి' దర్శకుడు
- సైలెంట్ థ్రిల్లర్ గా 'మెర్క్యురీ'
- కార్తీక్ సుబ్బరాజు పనితీరు అద్భుతం
- నిజంగానే ఇది ఒక ప్రయోగం
సైలెంట్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా .. ఎలాంటి సంభాషణలు లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పైనే నడుస్తుంది. కెమెరా పనితనంతోనే భయపెడుతుంది. అలాంటి ఈ సినిమా స్పెషల్ షోను 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా చూశాడట. సినిమా కొత్తగా .. చాలా బాగుందని ఆయన కితాబు ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు అద్భుతంగా తీశాడనీ .. సాంకేతిక పరిజ్ఞానం ఆశ్చర్యపరుస్తుందని చెప్పాడు. ఇదొక ప్రయోగమనీ .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.