ఆసక్తిని రేపుతోన్న టైటిల్ 'సైంధవ' .. హీరోగా నాగశౌర్య!
- 'ఛలో' హిట్ తో నాగశౌర్య
- కొత్త దర్శకుడితో నెక్స్ట్ మూవీ
- త్వరలో పూర్తి వివరాలు
'సైంధవుడు' అనే పాత్ర మనకి 'మహాభారతం'లో కనిపిస్తుంది. ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 'సైంధవుడు' .. పాండవులు ప్రాణభిక్ష పెట్టడంతో బయటపడతాడు. ఆ కసితో ఆయన అభిమన్యుడి మరణానికి కారకుడవుతాడు. అలా సైంధవుడి పాత్ర కనిపిస్తుంది. ఈ సినిమా కథ ఎలా వుంటుందో తెలియదుగానీ .. టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.