ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు రణ్ వీర్ సింగ్ రావడం లేదు!
- ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు దూరమైన రణ్ వీర్ సింగ్
- రణ్ వీర్ స్థానంలో వరుణ్ ధావన్
- వరుణ్ ప్రదర్శనకు 6 కోట్ల రెమ్యూనరేషన్?
ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, పరిణతి చోప్రా తదితరులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలు ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వరుణ్ ధావన్ 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగినట్టు బీటౌన్ కథనాలు చెబుతున్నాయి.