రజనీకాంత్ సరసన మరోమారు నయనతార?
- రజనీతో కార్తీక్ సుబ్బరాజ్
- కథానాయికల పేర్లు పరిశీలన
- కొత్తగా తెరపైకి నయనతార పేరు
రజనీ సరసన అంజలి సెట్ కాకపోవచ్చనే వారి సంఖ్యనే ఎక్కువగా వుంది. అందువలన ఈ సినిమా టీమ్ నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ గా రజనీ సరసన సెట్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన 'చంద్రముఖి' అందుకు ఒక ఉదాహరణ. అందువలన నయనతారను తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.